ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో దగ్ధమైన కారు

SMTV Desk 2017-11-24 15:23:06  AP CM Chandrababu naidu, car faring, amaravathi

అమరావతి, నవంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ముందు నేడు ఓ కారుకు మంటలు వ్యాపించాయి. కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు చెందిన మహీంద్రా ఎక్స్‌ఏవీ కారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా దగ్ధమైంది. డీజిల్‌ ట్యాంక్‌లోకి మంటలు వ్యాపించడంతో పోలీసులు దాని సమీపంలోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కారు ఏ క్షణాన పేలుతుందోనని అగ్నిమాపక సిబ్బంది కూడా దూరం నుంచి నీళ్లు చల్లారు. మంటల వేడిమికి కారు అద్దాలు భారీ శబ్దం చేసుకుంటూ పేలాయి. సీఎం నివాసానికి అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అన్ని కోణాల్లోనూ విచారణ జరుపనున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారులో ఉన్నవారందరూ దిగి దూరంగా పరుగెట్టారు.