ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాలు

SMTV Desk 2017-06-13 13:34:18  America,India,H1B visa,Narendra modi , Trump

వాషింగ్టన్, జూన్ 13 : అమెరికా, భారత్ దేశాల మధ్య ఈ నెల 26 న ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీరివురి మధ్య జరిగే తొలి సమావేశం కావడం విశేషం. జూన్ 26 న జరిగే ఈ సమావేశానికి ట్రంప్ చాలా ఎదురుచూస్తున్నారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ తెలిపారు. జూన్ 25 న భారత ప్రధాన మంత్రి మోదీ, అమెరికా పర్యటన ఖరారయ్యింది. జూన్ 26 న ట్రంప్ తో జరిగే సమావేశంలో రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల గురించి మోదీ చర్చించనున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల పౌరులకు ఉపయోగపడేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాద నిర్మూలన, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణపరమైన చర్యల విస్తరణ , ఆర్థిక పెరుగుదల, సంస్కరణలు, అంశాలపై చర్చలు జరుపుతారు’ అని స్పైసర్‌ వెల్లడించారు. భారత పౌరులు అమెరికాలో విద్యనభ్యసించేందుకు కావలసిన హెచ్-1 బీ వీసాల ఏర్పాటు ప్రక్రియ, రక్షణ రంగంలో సహాయం, ప్రాంతీయ భద్రత, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మాట్లాడే అవకాశాలున్నాయని తెలిపారు.