తల్లి పాలతో ఫుడ్ ఎలర్జీకి స్వస్తి...

SMTV Desk 2017-11-23 16:23:04  Mother milk, Boston Childrens Hospital, Harvard Medical Researchers

బోస్టన్, నవంబర్ 23: తల్లి పాలతోనే పిల్లలకు ఆరోగ్యమని వైద్యులు అంటుంటారు. అంతేకాదు ఆ పాలతో పిల్లల్లో ఏర్పడే ఫుడ్ ఎలర్జీ సమస్యకు స్వస్తి చెప్పొచ్చని పరిశోధకులు వెల్లడించారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ పరిశోధకులు దీనిపై పరిశోధన చేయగా... ఓ మహిళా బాలింతగా ఉన్నపుడు పాలు, గుడ్లు, వేరుశెనగ గింజలు, సమృద్ధిగా తీసుకుంటే, ఆ పాలు తాగిన పిల్లలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు తద్వారా రోగాలు దరిచేరకుండా చేసినట్లు గుర్తించారు. కానీ కొందరు బాలింతలు పాలు, గుడ్లు, వేరుశెనగ, సోయా, గోధుమ, చేపలు తింటే ఎలర్జీ అవుతుందని భావిస్తుంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు అపోహ మాత్రమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.