ప్రచండ భానుడి పరిశోధనకు ఉపగ్రహం: ఇస్రో

SMTV Desk 2017-11-23 15:57:18  isro, pslv xl, sattilite, sun

బెంగళూరు, నవంబర్ 23: మండే భానుడిలో నిక్షిప్తమైన రహస్యాల ఛేదనకు భారత అ౦తరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్దమవుతున్నది. ఇందుకు గాను ఆదిత్య-ఎల్ 1 పేరిట ఒక ఉపగ్రహాన్ని 2019లో భానుడిపైకి ప్రయోగించనుంది. సౌర భౌతికశాస్త్రంలో తెలియని అంశాలను పరిశోధించడానికి, అలాగే శుక్రగ్రహం పైకి ఒకటి, అంగారకుడు పైకి మరో ఉపగ్రహ ప్రయోగ ప్రతిపాదనలు ఉన్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు దూరంలో భూమి-సూర్యుడు పరిభ్రమించే వ్యవస్థలోని వచ్చే హేల్ అర్బిట్ లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగలిగితే సూర్యుణ్ణి స్పష్టంగా, గ్రహానాలోచ్చిన ఇబ్బందులు లేకుండా పరిశోధించవచ్చని నిర్ణయించారు. 2019-20ల్లో ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుండి పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ ద్వారా ప్రయోగించనున్నారు.