ఫేస్ బుక్ ఆధ్వర్యంలో డిజిటల్ నైపుణ్య శిక్షణ

SMTV Desk 2017-11-23 12:51:12  face book, digital training, start ups, digital india

న్యూఢిల్లీ, నవంబర్ 23 : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ ఇండియాలో సుమారు 5 లక్షల మందికి డిజిటల్ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత సాంకేతికరంగంలో అంకుర సంస్థలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. వాటికీ అండగా ఫేస్ బుక్ సంస్థ ఫేస్‌బుక్‌ డిజిటల్‌ ట్రైనింగ్‌, ఫేస్‌బుక్‌ స్టార్టప్‌ ట్రైనింగ్‌ హబ్స్‌ పేరుతో వ్యక్తులు, స్టార్ట్‌పల కోసం శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ‘‘2022కల్లా భారత్‌ డిజిటల్‌ ఎకానమీ లక్ష కోట్ల డాలర్లకు (రూ.65 లక్షల కోట్లు) చేరుకోవచ్చని అంచనా. ఇందు కోసం భారత్ ను ముందుకు నడిపించేందుకు పరిజ్ఞానం, నైపుణ్యం సమకూర్చడమే ఉత్తమమైన మార్గం’’అని ఫేస్‌ బుక్ ప్రతినిధి తెలిపారు.