మళ్లీ వినాయక్ తో.. అల్లుడు శ్రీను...!

SMTV Desk 2017-11-22 17:52:37  bellamkonda srinivas, vv vinayak,

హైదరాబాద్, నవంబర్ 22: ‘అల్లుడు శ్రీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేశారు వి.వి.వినాయక్. ఈ సినిమా తరువాత నటించిన స్పీడున్నోడు మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘జయ జానకి నాయక’ హిట్ కొట్టడంతో, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ మూవీ చేస్తున్నారు శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, వీళ్ల కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.