రియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఆధార్ లింక్?

SMTV Desk 2017-11-22 15:51:42  adhar link, real estate, central govt

న్యూ డిల్లీ, నవంబర్ 22: నల్లధనం పై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఆస్తుల లావాదేవీలకు కూడా ఆధార్ కార్డు లింక్ పెట్టాలని భావిస్తోంది. నల్లధనం నిర్మూలనకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. స్థిరాస్తుల లావాదేవీలను ఆధార్‌తో అనుసంధానించటం అన్నది నల్లధనం వెలికితీతలో ఒక భాగమేనని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌ పూరీ చెప్పారు. త్వరలోనే దీని అమలుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందన్నారు. స్థిరాస్తి వ్యాపారంలో నల్లధనం పాత్ర భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందేనని, దానిపై చర్యలకు ఎక్కువ టైమ్ తీసుకోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ అనుసంధానం చేశామని, దానితో పాటు కొన్ని అదనపు చర్యలతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ను అనుసంధానం చేయవచ్చని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లలో ఇప్పటికే ఆధార్ కార్డుతోనే లావాదేవీలను అనుమతిస్తున్నారు. మరి కొత్తగా మోది ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకు౦టు౦దో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.