డిసెంబర్ 1 నుండి రేషన్ డీలర్ల సమ్మె!

SMTV Desk 2017-11-22 13:03:31  ration dealers strike, ramesh babu, telangana govt

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ లో రేషన్ డీలర్లు సమస్యల పరిష్కారం కోసం మళ్లీ సమ్మెకు సిద్దమవుతున్నారు. నవంబర్ 1 నుండి నాలుగు రోజులపాటు రేషన్ డీలర్లు సమ్మె చేయగా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు. అయితే, హామీని ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చక పోవడంతో డిసెంబర్ 1వ తేదీ నుండి మళ్లీ సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల స౦క్షెమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు ప్రకటించి, సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు