సినీ నిర్మాత అశోక్ ఆత్మహత్య..!

SMTV Desk 2017-11-22 12:40:01  film producer ashok, ashok suicid,

చెన్నై, నవంబర్ 22: సినిమా అంటే క్రేజ్.. ఆ క్రేజితోనే ఎంతో మంది ఉన్నవి సరిపోక అప్పులు తెచ్చి మరి సినిమాలు తీస్తున్నారు. సినిమా హిట్ అయితే అంత బాగానే ఉంటుంది లేకపోతే జీవితాలే ఆరిపోతాయి. అందుకు నిదర్శనం సినీ నిర్మాత అశోక్ ఆత్మహత్యే. చెన్నైలోని ఆర్కాడు రోడ్డు వల్పరవాక్కం ప్రాంతంలో తమిళ సినీ నిర్మాత అశోక్ (40) నిన్న సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశోక్ సహ నిర్మాతగా పలు సినిమాలకు పెట్టుబడులు పెట్టి, అప్పుల ఊబిలో కూరుకుపోవడమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు అశోక్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.