చార్మినార్ కు అరుదైన గుర్తింపు!

SMTV Desk 2017-11-22 12:36:21  charminar, swatch icon, central govt, modi.

హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ ఐకాన్ చార్మినార్ కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో ప్రఖ్యాత 10 ఐకానిక్ ప్రదేశాల్లో ఒకటిగా చార్మినార్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతియేటా ఐకానిక్ ప్రాంతాలను ఎంపిక చేసి స్వచ్ఛతకు మోడల్ గా తీర్చిదిద్దుతుంది. ఐకానిక్ ప్రాంతాలను స్వచ్ఛతా పరంగా సమగ్రాభివృద్ది చేసే బాధ్యతను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగిస్తారు. చార్మినార్ ను స్వచ్ఛ ఐకాన్ గా తీర్చి దిద్దే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దీనిపై డిల్లీలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎ౦సీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొని చార్మినార్ అభివృద్ది గురించి చర్చించారు.