సొంత సైనికుడిపైననే దాడి చేసిన వీడియో విడుదల

SMTV Desk 2017-11-22 12:17:16  North Korea, United Nations Command, video

సియోల్, నవంబర్ 22 ‌: ఉత్తరకొరియా దుకూడుకు సొంత సైనికుడిపైనే ఈ నెల 13న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌ విడుదల చేసింది. పన్‌మున్‌జామ్‌ గ్రామం వద్ద ఓ సైనికుడు తన వాహనంలో దక్షిణకొరియా వైపు వెళ్లబోయాడు. గమనించిన ఉత్తరకొరియా సైనికులు వెంటనే అతడ్ని వెంబడించి అడ్డుకున్నారు. దీంతో అతడు వాహనం నుంచి దిగి పరుగులు తీశాడు. దీంతో మిగతా జవాన్లు ఆ సైనికుడిపై ఆయుధాలు ఎక్కుపెడుతూ వెంబడించి, అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు సైనికుడిని దక్షిణకొరియాకు చెందిన ముగ్గురు సైనికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు దక్షిణకొరియాలోని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం.