ట్రిపుల్ తలాక్ కు ఇక జైలే!

SMTV Desk 2017-11-22 11:50:44  tripul talak, modi, central govt bill, muslim

న్యూ డిల్లీ, నవంబర్ 22: ముస్లిం వివాహాల విడాకులకు సంబంధించి అనాదిగా వస్తున్న ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని రూపు మాపడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. మూడుసార్లు వెంట వెంటనే తలాక్ చెప్పి విడాకులు ప్రకటించుకునే భర్తలను జైలుకు పంపే బిల్లును మోడీ సర్కార్ తయారు చేస్తుంది. జైలుతో పాటు జరిమానా కూడా విధించేందుకు వీలు కల్పించే సదరు బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సమగ్ర అధ్యయనానికి మంత్రుల సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో న్యాయ, మహిళా శిశు సంక్షేమ౦, సామాజిక న్యాయం, మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రులు సభ్యులు. ఈ సంఘం ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణించి, శిక్షించే నిబంధనలను రూపొందిస్తుంది