రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు

SMTV Desk 2017-06-12 19:19:14  Bey Of Bengal,Monsoon, Telangana,Rayalaseema

విశాఖపట్నం, జూన్ 12 : బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఊపుతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాకు రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తాలోని నర్సాపూర్‌ వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా, వరుసగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత రెండుమూడు రోజులుగా వానలు కురవడంతో ప్రజలు, రైతులు వేసవి వేడికి తట్టుకోలేక ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. వర్షాలు ఎక్కువ కురవటం వల్ల సాధారణ ప్రజలు నిత్య అవసరాలకు కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రోడ్లన్ని జలమయం అవ్వడం వల్ల వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడుతున్నాయి.