విజయ్ మాల్యా వర్సెస్ రాబర్ట్ వాద్రా

SMTV Desk 2017-11-21 16:37:16  vijay malya, robert vadraa, london, npa assets, king fisher

లండన్, నవంబర్ 21 : బ్యాంకులకు దాదాపు రూ. రూ.9వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా బ్రిటన్‌ కోర్టు లో హాజరయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందిగా బ్రిటన్‌ కోర్టును కోరడంపై స్పందించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభ్రద సింగ్‌ మాదిరిగా తాను కూడా రాజకీయ బాధితుడినని పేర్కొన్నారు. దాదాపు సంవత్సరం క్రిందట ఇంగ్లాండ్ రాజధాని లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ను, అప్పగించాల్సిందిగా కోరుతూ భారత్‌ అధికారులు బ్రిటన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపిన అవి విఫలమయ్యాయి. లండన్ పోలీస్ లు అతనని రెండు సార్లు అరెస్టు చేసిన, కొన్ని నిముషాల వ్యవధిలో బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేశారు. ఇంతక ముందు కూడా మాల్యా తనకేమి తెలియదని, రాజకీయంగా నన్ను వాడుకున్నారని, ఆరోపణలు చేశారు. ఈ విషయం పై రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ " మాల్యా నా పేరు ని మరల వాడుకున్నారు. ఇప్పటికే చాలా మంది నా పేరును అడ్డం పెట్టుకొని మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఆయనకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయ బాధితుడినే.. కానీ ఎప్పుడూ నా పరపతిని తప్పుగా ఉపయోగించలేదు. ఆయనలాగా నేను ఎవరి సొమ్ముతో విదేశాలకు పారిపోలేదు. ఇప్పటికైనా భారత్ వచ్చి ఆయనపై ఉన్న అన్ని కేసుల విచారణకు హాజరుకావాలని కోరుతున్నాను." అని ఘాటుగా స్పందించారు