చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు

SMTV Desk 2017-06-12 18:48:17  cyber crime,

హైదరాబాద్, జూన్ 12 : సైబర్ క్రైమ్ నిందితులు పోలీసులకు దొరకాకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఒక కేసులో పట్టుపడితే పోలీసులు ఎలా పట్టుకున్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు. తరువాత చేసే మోసాల్లో ఆ తప్పులను తిరిగి చేయకుండా జాగ్రత్త పడుతూ పోలీసులకు దొరకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను తమ న్యాయవాదుల సహకారం తో తెలుసుకుంటున్నారు. బెయిల్ పై బయటకు వెళ్ళిన తరువాత తిరిగి ఆ తప్పులు చేయకుండా మరిన్ని మోసాలు చేస్తున్నారు. అయితే గతంలో పట్టుబడిన ప్రాంతాల్లో కాకుండా కొత్త ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టి మోసాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో బాధితుల డిపాజిట్లు చేసిన సుమారు 80 కేసులకు సంబంధించిన 400 బ్యాంక్ ఖాతాల పై అరా తీసారు. చాలా బ్యాంక్ ఖాతాల్లో పొందుపరచిన చిరునామాకు వ్యక్తులకు మధ్య సంబందాలు లేవు బ్యాంక్ అధికారులు మాత్రం తమకేమి తెలియదు అంటున్నారు. ఖాతా తెరిచేసమయంలో వారిచ్చిన చిరునామాలను బట్టి ఖాతాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఇలాంటి కేసులల్లో బాధితులు నుంచి సేకరించిన చిరునామాలు ఆధార కార్డుల వివరాలతో ఆయా ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాలు కూడా తెరుస్తున్నారు. పోలీసులు అధార్ కార్డు వివరాలు హైదరాబాద్ కు చెందిన వారిదని తెలిసింది. దీంతో ఆ ఆధార్ కార్డు దారుడిని ప్రశిస్తే అతను గతంలో మోసపోయిన బాధితుడని తెలిసింది. # అనుమానం వస్తే సిమ్ కార్డు మాయం : ఉద్యోగాలు, మ్యాట్రిమోని, వ్యాపారం, లాటరీలు సైబర్ చిటర్లు డబ్బులు లక్షల్లో అమాయకుల వద్ద నుంచి మాయమాటలు చెబుతూ దోచేస్తున్నారు. అత్యాశకు పోయి కొందరు సంపాదించినా సొమ్ముతో పాటు అప్పులు తెచ్చి మరి సైబర్ చిటర్లకు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇలాంటి సందర్బాలలో ఒక్కొక్కరిని ట్రాక్ చేసేందుకు ఒక సిమ్ కార్డు వాడుతున్నారు. బాధితుడు నమ్మినన్ని రోజులు ఆ సిమ్ కార్డు వాడుతున్నారు. అతని అనుమానం వచ్చిదని తెలిస్తే ఆ సిమ్ కార్డును చెత్త కుండీలో పడేస్తున్నారు. దీంతో పాటు బ్యాంక్ ఖాతా ఫ్రిజ్ అయ్యిందంటే వారు వారు ఉపయోగించే సిమ్ కార్డులు ధ్వంసం చేసి చెత్త కుప్పలో పడేస్తున్నారు. # నగర వాసి వివరాలతో చెన్నైలో ఖాతా : ఉద్యోగం కోసమని ఓ ఉద్యోగికి ఇంటర్ నెట్ లో ప్రయత్నిస్తుండగా సైబర్ చిటర్ల చేతిలో పడ్డాడు. విదేశాల్లో ఐదెంకెల జీతంతో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మీ పూర్తి వివరాలు తమ మెయిల్ కి మెయిల్ చేయమంటు మెయిల్ చేసారు. దీంతో బాధితుడు వాళ్ళు అడిగిన వివరాలు అన్ని మెయిల్ చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తామని ప్రాసెసింగ్ ఫీజ్ లు, బ్యాక్ డోర్ ఫీజ్ లంటూ అతని దగ్గర దాదాపు రూ. 3 లక్షల వరకు మోసం చేయడంతో బాధితుడు తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఇటీవలే మరో భాదితుడు ఇలాంటి కేసులోనే ఫిర్యాదు చేశాడు. ఇటీవల సోలార్ ప్రాజెక్ట్ లో పేరుతో మోసాలకు బోర్జ్ అగస్టిన్ కేసులో మిగితా నిందితులను పట్టుకోవడానికి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాల పై పోలీసులు అరా తీసాడు. అయితే బ్యాంక్ ఖాతా తెరిచే సమయంలో ఉన్న అధార్ కార్డు చిరునామా హైదరాబాద్ కు సంబంధించి ఉంది. దొంగ హైదరాబాద్ లోనే ఉన్నాడని ఉహించిన పోలీసులు సదరు ఖాతాదారుడి చిరునామాలో పొందు పరిచిన ఆధార్ కార్డు నెంబర్ గల సదరు వ్యక్తిని విచారించారు. పోలీసులు అతడు చెప్పన మాటలు విని ఖంగుతిన్నారు. తను గతంలో సైబర్ చిటర్ల చేతిలో మోసపోయిన బాధితుడి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు అసలు విషయాన్నీ గుర్తించారు. గతంలో మోసం చేసిన నిందితులే, బాధితుల వివరాలతో చెన్నైలో ఖాతా తెరిచి పోలీసులకు దొరుకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. ఇలా సైబర్ చీటర్లు కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు.