ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన మద్రాసు హైకోర్టు

SMTV Desk 2017-11-21 15:38:08  Arkenagar, elections, thamilanadu, High court

చెన్నై, నవంబర్ 21 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్కేనగర్‌ స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబరు 31లోగా నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించి, కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సిందిగా న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన రోజే ఆర్కేనగర్‌ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ ఏడాది చివరి లోపే అక్కడ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఆర్కేనగర్‌ స్థానాన్ని చేజిక్కించుకోవడం కోసం శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జయ మేనకోడలు దీప కూడా ఆర్కేనగర్‌ ఎన్నికలో పోటీ చేస్తానని తెలిపారు.