హీరో కామెంట్ కు.. స్మృతి ఇరానీ చురకలు...

SMTV Desk 2017-11-21 15:36:37  smriti irani, rajkumar rao, 48 international film festival of india.

గోవా, నవంబర్ 21: 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇరానియన్‌ దర్శకుడు మజిద్‌ మజీది తెరకెక్కించిన ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా గురించి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌ రావు మాట్లాడుతూ.. ‘అరె.. మజిద్‌ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయన కూడా ఇరానీనే’ అని కామెంట్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ ‘ఓ మంత్రిపై హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ కామెంట్‌ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తోందో. ధన్యవాదాలు రాజ్‌కుమార్‌. కనీసం నీ కామెంట్‌తోనైనా నీ కాలు విరగొట్టింది భాజపా కార్యకర్తలేనని ఎవ్వరూ మాపై నిందలు వేయకుండా ఉంటారు’ అని చురకలు అంటించారు. చిత్రీకరణ సమయంలో రాజ్‌కుమార్‌ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో చేతికర్రలతోనే ఆయన కార్యక్రమానికి వచ్చారు.