వైజాగ్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది : వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-06-12 18:43:39  Vishakapatnam, Central Minister Venkaiah naidu, sabka saath sabka vikas

విశాఖపట్నం, జూన్ 12 : విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో జరిగిన "సబ్కా సాత్ సబ్కా వికాస్" కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైజాగ్ తో తనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, అందుకే విశాఖను స్మార్ట్ నగరాల్లో ఒకటిగా ఎంచుకున్నానని అన్నారు. స్వచ్చ భారత్ పోటీలో వైజాగ్ మూడవ స్థానంలో ఉండటంతో విశాఖ కలెక్టర్, మున్సిపల్, సానిటరీ వర్కర్స్, రెసిడెంట్ అసోసియేషన్లు, విశాఖకు చెందిన వారికి వెంకయ్యనాయుడు అవార్డులను అందజేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్, భారతదేశంలో ద్వితీయ స్థానాన్ని గెలుచుకున్నందుకు చైర్మన్ కృష్ణ బాబును, ఇతర అధికారులను కూడా మంత్రి అభినందించారు. విశాఖ రైల్వే జంక్షన్ పరిశుభ్రతలో మొదటి స్థానం సంపాదించిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దీని కోసం అతను రైల్వే సిబ్బందిని విశాఖ ప్రజలతో కలిసి అభినందించారు. 2019 నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్చ భారత్ ను విజయవంతం చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు.