సభాపతి స్థానాన్ని కించపరిచిన అంబటి

SMTV Desk 2017-11-21 14:54:24  Vaikappa leader Ambati Rambabu, Saba Violation Resolution, Chief Whip Palle Raghunatha Reddy AP assembly

అమరావతి, నవంబర్ 21 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల సమావేశాల్లో భాగంగా వైకాపా నేత అంబటి రాంబాబుపై సభలో సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. నేడు రాజ్యాంగబద్ధమైన సభాపతి స్థానాన్ని కించపరిచేలా అంబటి వ్యాఖ్యలు చేశారని, 168 నిబంధన కింద అంబటి రాంబాబుపై చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ... సభాపతి స్థానాన్ని విమర్శించడం సరికాదని, అంతేకాకుండా సభాపతి స్థానంపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు.