కిరోసిన్‌ కోటాకు కోత...!

SMTV Desk 2017-11-21 13:20:52  Subsidy Kerosene, Department of State Civil Supplies Department

హైదరాబాద్‌, నవంబరు 21 : గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న కిరోసిన్‌ కోటాను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి కూడా కిరోసిన్‌ కోటాపై కోత విధిస్తున్నట్లు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సబ్సిడీ కిరోసిన్‌ను ఎవరికైనా ఒక లీటరే ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కాగా, గ్యాస్‌ వినియోగం బాగా పెరిగిపోవడంతో, కిరోసిన్‌ వినియోగం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రతిసారి కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రతి నెలా 9072 కిలో లీటర్ల కిరోసిన్‌ వస్తుండగా, ఈసారి దాన్ని 8184 కిలో లీటర్లకు తగ్గించింది.