వేధించాడు...దొరికిపోయాడు

SMTV Desk 2017-11-21 12:47:23  harresment, whats app, hr in corporate company, huderabad, she teams

హైదరాబాద్, నవంబర్ 21 : అతనొక కార్పొరేట్ కంపెనీ మానవ వనరుల(హెచ్ ఆర్) విభాగానికి అధిపతి... కంపెనీ ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి తన వికృత చేష్టలతో ఒక యువతికి వాట్సాప్‌ ద్వారా అశ్లీల చిత్రాలు పంపుతూ వేధించాడు. యువతి ఫిర్యాదు తో చివరకు దొరికిపోయాడు. సోమవారం అదనపు కమిషనర్‌ (నేర పరిశోధన) స్వాతిలక్రా వెల్లడించిన వివరాల ప్రకారం... హిమాయత్‌నగర్‌కు చెందిన బి.నరేందర్‌సింగ్‌(35) ఓ ఐటీ సంస్థలో మానవ వనరుల విభాగ అధిపతిగా పని చేస్తున్నాడు. ఓ యువతి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐటీ ఉద్యోగం కోసం అతడిని ఆశ్రయించింది. ఇంటర్వూ నిర్వహింపజేసి త్వరలోనే ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతికి వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలను పంపించడం ప్రారంభించాడు. యువతి పలుమార్లు ఫోన్‌ద్వారా మందలించిన వినలేదు. వేధింపులు అధికమవుతుండటంతో యువతి ‘షి’ బృందాన్ని ఆశ్రయించి సమస్యను వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ గ్రూపులు, తదితర సంక్షిప్త సమాచారాలను పరిశీలించి నరేందర్‌సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా రిమాండ్‌ విధించింది.