ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్...

SMTV Desk 2017-11-21 12:35:12  trump, Kim jong un, white house, donald trump.

వాషింగ్టన్, నవంబర్ 21: అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పై ఆంక్షలు విధిస్తూ మరో షాక్ ఇచ్చారు. ‘‘నార్త్ కొరియాను నేడు ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటిస్తున్నాం. చాలా ఏళ్ల క్రితమే ఈ పని చేయాల్సింది’’ అని శ్వేతసౌధంలో సోమవారం ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న నార్త్ కొరియా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతోందని, విదేశాలను నాశనం చేయాలని చూస్తోందని ట్రంప్ విమర్శించారు. నార్త్ కొరియా చట్టబద్ధంగా నడుచుకోవాలని, అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి చెప్పి, అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే చర్యలను మానుకోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు. ప్రపంచం దేశాలు చెబుతున్నా..ఐక్యరాజ్య సమితి విన్న విస్తున్నా... వినకుండా నార్త్ కొరియా అడుగడుగునా క్షిపణి పరీక్ష నిర్వహిస్తూ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పలు అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణులను పరీక్షించిన నార్త్ కొరియా మరిన్ని పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.