ఆర్టీసీ వద్దు.. మెట్రో ముద్దు

SMTV Desk 2017-11-21 11:56:42  about metro, metro rail launching, hyderabad updates

హైదరాబాద్, నవంబర్ 21: హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 28 న ప్రధాని మోది చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభం తో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తగ్గే అవకాశాలున్నాయి. అలాగే ప్రయాణికులు నగరంలో ఎక్కడికి పోవాలన్నా గంటల కొద్ది సమయం పట్టేది. ఇప్పుడు మెట్రో రైలు తిరిగే ప్రాంతాలలో ఎక్కడికి పోవాలన్నా నిమిషాల వ్యవధిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్టీసీ తో పోల్చుకుంటే మెట్రో ప్రయాణం కొంతమేర ఖర్చుతో కూడుకోవడం అల్ప వేతన జీవులకు ఇబ్బందికర వార్త.