ఒకరితో ఒకరు పోటీపడ్డారు

SMTV Desk 2017-06-12 16:43:40  millar, dupless, kohli

ఇంగ్లాండ్, జూన్ 12 : ఛాంపియన్స్ ట్రోఫి ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు రనౌట్ నుంచి తప్పించుకోవడానికి ఒకరి ఒకరు పోటిపడి మరి ఈ అరుదైన సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసారు. డివిలియర్స్, మిల్లర్ రనౌట్ భారత్ కు టర్నింగ్ పాయింట్. ముఖ్యంగా డుప్లెసిస్ సమన్వయలోపంతో మిల్లర్ రనౌట్ విధానం నవ్వు తెప్పించింది. అశ్విన్ వేసిన 30 వ ఓవర్ మొదటి బంతిని థర్డ్ మెన్ వైపు ఆడిన డుప్లెసిస్ పరుగు అందుకున్నాడు. కాస్త దూరం వెళ్ళగానే... మరో వైపు వస్తున్నా డేవిడ్ మిల్లర్ వద్దని చెప్పినా... మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళాడు. దాంతో అతను వస్తున్నడేమోనని మిల్లర్ పరుగుకు ప్రయత్నించాడు. కాని డుప్లెసిస్ మళ్ళీ వెనక్కి రావడంతో ఇద్దరు ఒకే ఎండ్ కు చేరుకున్నారు. బుమ్రా నుంచి బంతిని అందుకున్న కోహ్లి నాన్ స్టయికర్ వికెట్లను బంతి తో కొట్టాడు. దాంతో డుప్లెసిస్, మిల్లర్ లో ఎవరు అవుట్ అయ్యారో తెలిపేందుకు థర్డ్ అంపైర్ ను రివ్యూ కోరాల్సి వచ్చింది. అప్పుడు మిల్లర్ ను రనౌట్ గా డిక్లేర్ చేసారు. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్న ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.