జీఎస్టీ పై అసంతృప్తితో టెలికాం రంగం

SMTV Desk 2017-06-12 16:20:14  Uncomfortable telecom sector,GST,Tax burden is 18 percent

న్యూ ఢిల్లీ, జూన్ 12 : టెలికాం సర్వీసులపై జీఎస్టీ భారాన్ని తగ్గించకపోవడంపై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నెల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టెలికం సర్వీసులపై పన్ను భారాన్ని 18 శాతంగా నిర్ణయించారు. టెలికాం సేవలను సైతం అత్యవసర కేటగిరీలో చేర్చాలని, పన్ను భారాన్ని 5 శాతానికి తగ్గించాలని మొబైల్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన జీఎస్టీ చివరి సమావేశంలో టెలికం రంగంపై పన్నుభారాన్ని తగ్గిస్తారని ఆశించిన ఆపరేటర్ల కు నిరాశే మిగిలింది. ప్రస్తుతం 15 శాతానికి ఉన్న పన్ను భారం ఏకంగా మూడు శాతానికి పెరగనుండటంతో వచ్చేనెల నుంచి టెలి ఫోన్ బిల్లులు, ఇతర సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న టెలికం సంస్థలకు జీఎస్టీ హయంలో మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.