ఏపీ, తెలంగాణకు వర్ష సూచనలు

SMTV Desk 2017-11-20 11:29:44   weather report, andhrapradesh, telangana,

హైదరాబాద్, నవంబర్ 20 : ఇరు తెలుగు రాష్ట్రాలలో రానున్న 24 గంటల్లో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖా అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తూర్పు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ గాలుల ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వేటకు వెళ్ళే మత్స్యకారులు కొంచెం జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.