ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలలో అపశ్రుతి.

SMTV Desk 2017-11-19 18:33:57  Indira Gandhis birthday celebration, fighting, Former minister C.Ramchandra Reddy.

ఆదిలాబాద్‌, నవంబర్ 19 : ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలలో విభేదాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత వర్గీయులు తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొదట ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అనంతరం వేదిక వైపు వెళ్లారు. ఈ క్రమంలో వేదిక కింద కూర్చునే క్రమంలో ఇరు వర్గీయులకు మాట.. మాట పెరగడం తోపులాటకు దారితీసింది. వీహెచ్‌ ప్రసంగానికి పలువురు అడ్డు తగలడంతో అసహనంతో వేదిక దిగి వెళ్లిపోయారు. అనంతరం నేతలంతా ఆయన్ను సముదాయించడంతో వేదికపైకి ఆయన తిరిగి రావడంతో ఆ వివాదం సద్దుమణిగింది.