జీఎస్టీ మండలి పన్నుకోత

SMTV Desk 2017-06-12 15:45:47  GSTC Council Tax Code, Union Finance Minister Arun Jaitley

న్యూ ఢిల్లీ, జూన్ 12 : దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో ఆదివారం రోజున చివరి జీఎస్టీ సమావేశమైన విషయం తెలిసిందే. పన్నులకోత పై ఇవే చివరి మార్పులంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. సామాన్యులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించడంతో పాటు జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై పరిశ్రమతో సమాజంలోని వివిధ వర్గాలనుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. పన్ను రేట్లను 133 పరిశ్రమలనుంచి వచ్చిన డిమాండ్లను సమీక్షించి.. 66 వస్తువులపై పన్నురేట్లు తగ్గించాలని నిర్ణయించింది. ప్యాకేజ్డ్‌ ఆహారం, స్కూలు బ్యాగులతోపాటు రోజువారి వినియోగంలో వచ్చే వస్తువులపై పన్నును తగ్గించినట్లు జైట్లీ వెల్లడించారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, భీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతికత, రవాణా, చమురు, గ్యాస్‌ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటుచేసింది. వంటింటి పదార్థాలైన పచ్చళ్లు, ఆవాలతోపాటుగా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నురేట్లు తగ్గించింది. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మేలుకలిగే విదంగా రూ.100 లోపల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28 శాతం నుంచి తొలగించి 18 శాతం శ్లాబులోకి చేర్చారు. రూ.100 పైనున్న టికెట్లపై ధరలు ఇటీవల నిర్ణయించిన రేటు (28 శాతం)తోనే కొనసాగనున్నాయి. పచ్చళ్లు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 18 నుండి 12 శాతం లోకి చేర్చగా.. జీడిపప్పును 12 నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. ఏడాదికి 75 లక్షల టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్‌ యజమానులు (గత పరిమితి రూ.50 లక్షల టర్నోవర్‌) కాంపోజిషన్‌ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5 శాతం రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించింది. ‘ఆదాయ స్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం అంటూ దీనివల్ల కాస్త నష్టం కనబడుతున్నా చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రెస్టారెంట్లను ఆదుకోవాలని నిర్ణయించారు. ఎందుకంటే ఈ రంగాల్లోనే ఎక్కువ ఉపాధికల్పన జరుగుతోంది’ అని జైట్లీ వెల్లడించారు. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ 18న లాటరీ పన్నులు, ఈ-వే బిల్లులపై నిర్ణయం తీసుకోన్నునారు