శ్రీలంకను ముంచెత్తిన వరదలు, వందలాది మంది గల్లంతు

SMTV Desk 2017-05-27 14:02:23  disaster in srilanka,floods,srilanka,

హైదరాబాద్, మే 25 : భారీవర్షాల మూలంగా సంభవిస్తున్న వరదలు శ్రీలంకను ముంచెత్తుతున్నాయి. ఉత్తర-దక్షిణ, దక్షిణ-పశ్చిమ ప్రాంతాల్లో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల మూలంగా కొండచరియలు సైతం విరిగి పడుతున్నాయి. ఆ మూలంగా ఇప్పటి వరకు 91 మంది వరదల్లో చిక్కుకొని మృతి చెందగా మరో 110 మంది గల్లంతయ్యారు. వరద విపత్తు నుండి తమను ఆదుకోవాలని శ్రీలంక ప్రభుత్వం ఐక్యరాజ్యసమితితో పాటు పలు మిత్రదేశాలకు విజ్ఞప్తి చేసింది. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల నుండి సుమారు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిలటరీ బోట్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద విపత్తుతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భారత నౌకదళానికి చెందిన రెండు నౌకలు శ్రీలంకకు బయలు దేరాయి. ఐఎన్ఎస్ కిర్చా, ఐఎన్ఎస్ జలాశ్వ రెండు నౌకలు వైద్యసిబ్బంది, ఔషదాలు, పునరావాస సామాగ్రితో వెళ్ళిన ఆ నౌకలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.