హెరాత్ ఒంటరి పోరాటం...

SMTV Desk 2017-11-19 12:24:33  india, srilanka, first test, kolkatha,

కోల్‌కతా, నవంబర్ 19 : భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవ రోజు ఆటలో రంగాన హెరాత్(43) లంక జట్టుని ఆదుకున్నాడు. అతడికి తోడుగా . అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న సురంగ లక్మల్‌ (10) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. దీంతో భోజన విరామానికి, 74 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 263/8తో నిలిచింది. 91 పరుగుల ఆధిక్యంలో ఉంది. 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మరో 35 పరుగులు జోడించిన తరువాత డిక్ వెల్లా(35) వికెట్ ను కోల్పోయింది. అటు స్వల్ప వ్యవధిలో ఆపై దాసున్ షనక(0), చండిమాల్ (28)సైతం పెవిలియన్ కు చేరడంతో, పటిష్ట స్థితిలో కనిపించిన లంకేయులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, షమీలు తలో మూడు వికెట్లతో రాణించగా, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. హెరాత్ ఒంటరి పోరాటం... కోల్‌కతా, నవంబర్ 19 : భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవ రోజు ఆటలో రంగాన హెరాత్(43) లంక జట్టుని ఆదుకున్నాడు. అతడికి తోడుగా . అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న సురంగ లక్మల్‌ (10) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. దీంతో భోజన విరామానికి, 74 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 263/8తో నిలిచింది. 91 పరుగుల ఆధిక్యంలో ఉంది. 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మరో 35 పరుగులు జోడించిన తరువాత డిక్ వెల్లా(35) వికెట్ ను కోల్పోయింది. అటు స్వల్ప వ్యవధిలో ఆపై దాసున్ షనక(0), చండిమాల్ (28)సైతం పెవిలియన్ కు చేరడంతో, పటిష్ట స్థితిలో కనిపించిన లంకేయులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, షమీలు తలో మూడు వికెట్లతో రాణించగా, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి.