భారతీయ జనతా పార్టీలో చేరిన నటుడు రాహుల్‌ రాయ్‌

SMTV Desk 2017-11-19 11:09:37  Bollywood actor Rahul Roy, Bharatiya Janata Party, delhi, Prime Minister Narendra Modi and BJP leader Amit Shah

న్యూఢిల్లీ, నవంబర్ 19 : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ రాయ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన రాజకీయాలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దేశాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నారు. అలాగే ఇరుదేశాలు భారత్ ను చూసే దృష్టి విధానాన్ని కూడా మారుస్తున్నారని రాహుల్ అన్నారు. 1990లో విడుదలైన ఆషికీ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ నిర్మాతగా, మోడల్‌గా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు.