గెలుపుతో ఆనందం...బ్రతుకు భారం...

SMTV Desk 2017-11-18 18:52:46  divya karnan, national senior wrestling, gold medal, indore

ఇండోర్, నవంబర్ 18 : జాతీయ సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 59 కేజీల విభాగంలో 19 ఏళ్ల దివ్య కర్ణన్‌ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఆ విజయంతో తన సంతోషాన్ని బయట లంగోటీలు అమ్ముకుంటున్న వ్యక్తితో పంచుకుంది. అది చూసిన చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? దివ్య కర్ణన్‌ తండ్రి సూరజ్‌. కర్ణన్‌ తండ్రి స్వతహాగా బ్రతుకు దెరువు కోసం లంగోటీలు అమ్ముకుంటూ ఉంటాడు. తన కుమార్తె ఏ పోటీలకు వెళ్లినా, సూరజ్‌ ఆ స్టేడియం బయట తన పని కొనసాగిస్తాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. దివ్య స్వర్ణం నెగ్గిన తర్వాత సూరజ్‌ మాట్లాడుతూ"నా కుమార్తె దివ్య లోపల మ్యాచ్ లో పోరాడుతుంది. నేను స్టేడియం వెలుపల లంగోటీలు అమ్ముతున్నాను. తను కుటుంబం కోసం కష్టపడుతుంది. మా ఇద్దరి సంపాదన తో మేము జీవనం సాగిస్తున్నాము. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న దివ్య రజత పతకాన్ని అందుకుంది. కానీ కొన్ని ఆరోగ్య పరమైన కారణాలతో మూడు నెలలు పాటు ఆటకు దూరమైంది. ఎన్నో ఆర్ధిక ఇబ్బందుల మధ్య ఉన్న దివ్య తన విజయం కోసం ఆడగగా " దిల్లీ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొన్న నేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా మెడల్స్‌ సంపాదించాను. కానీ, నాకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ప్రస్తుతం ఈ విజయ స్పూర్తితో పోలాండ్‌లో జరగబోయే అండర్‌-23 పోటీలకు సిద్ధమవుతున్నా. ఆ తర్వాత కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగుతానని తెలిపారు.