ఊరంతా ఓ దారి అయితే.. జగన్ ది ఒక దారి: చంద్రబాబు

SMTV Desk 2017-11-18 13:13:57  chandrababu naidu, ap cm, amaravathi,

అమరావతి, నవంబర్ 18: అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహించిన "మొక్కలు నాటే కార్యక్రమం" లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మొక్క నాటి నీరు పోసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధానిలో మొత్తం 15 లక్షల మొక్కలు నాటుతామని అన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించేలా చేస్తామని చెప్పారు. కానీ రాజధాని నిర్మాణాన్ని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఊరంతా ఒక దారి అయితే..జగన్ ది ఒక దారి అంటూ విమర్శించారు. తెలుగు వారు గర్వించే విధంగా రాజధానిని నిర్మిస్తామని వాగ్ధానం చేశారు.