పది నాణేలు చెల్లుతాయి: ఆర్‌బీఐ

SMTV Desk 2017-11-17 19:33:29  Reserve Bank of India, ten rupee coins,

న్యూఢిల్లీ, నవంబర్ 17: గత కొద్ది కాలంగా పది నాణేలు చెల్లవంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రచారాన్ని భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అడ్డుకుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న రూ.10 నాణేలను, కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నామని ప్రకటించింది. ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ.10 నాణేలు కూడా చట్ట ప్రకారం చెల్లుతాయని స్పష్టం చేసింది. కొత్త, పాత నాణేలు విభిన్నంగా ఉన్నందున పాత‌వాటిని తీసుకోబోమని ఎవరైనా చెబితే 044–25399222 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇక పది నాణేలు కలిగి ఉన్న వాళ్లు కంగారు పడనవసరంలేదు.