నవ రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్...

SMTV Desk 2017-11-17 12:43:39  ngt order to ap govt, chandrababu naidu, amaravathi, ap news update

అమరావతి, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఎన్జీటి తుదితీర్పునిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్మాణం వల్ల వాతావరణం దెబ్బతింటుందని దాఖలైన నాలుగైదు పిటిషన్ల తోసిపుచ్చిన ఎన్జీటీ శుక్రవారం తీర్పునిచ్చింది. కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని, పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని తెలిపింది. అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షించి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి చేరవేసేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తునట్లు వెల్లడించింది.