సెల్యూట్ "రక్షణమంత్రి"...

SMTV Desk 2017-11-17 12:15:17  defence minister, nirmala seetha raman, army Soldier, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 17 : భారత్ రాజకీయ చరిత్రలో తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా 1975, 1980-82 కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భాద్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తొలిసారిగా పూర్తి పర్యాయం మహిళా రక్షణశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ నియమితులైన విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా సీతారామన్‌ దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లును కలుసుకొని వారితో మాట్లాడి భద్రతను సమీక్షించారు. అయితే...ఇక్కడకు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం సైనికులు వందనం చేసేటప్పుడు గందగోళానికి లోనయ్యారు. ఆమెను ‘మేడమ్‌’ అనాలా.. లేక ‘సర్‌’ అనాలా.. అనేది అర్థం కాక జవాన్లు తికమకపడ్డారు. ఒకసారి ‘జైహింద్‌ మేమ్‌సాబ్‌’ అంటే మరోసారి ‘జైహింద్‌ సర్‌’ అని సంభోధించారు. వెంటనే నిర్మలాసీతారామన్‌ స్పందిస్తూ. తనను సర్‌.. మేడమ్‌.. అని పిలవద్దని కేవలం ‘రక్షణ మంత్రి’ అంటే చాలని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆర్మీ ఆధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, రక్షణ మంత్రి అని పిలవమని చెప్పడం బాగుందని సీనియర్‌ ఆర్మీ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.