అఖిల్‌ ‘హలో’ టీజ‌ర్ విడుద‌ల‌...

SMTV Desk 2017-11-16 20:06:33  akhil hello teaser, hello movie teaser, nagarjuna, kalyani, vikram k kumar,

హైదరాబాద్, నవంబర్ 16: సిసింద్రీ మూవీ లో తన ముఖారవిందంతో అందరిని మంత్ర ముగ్ధులను చేసిన అక్కినేని అఖిల్ హీరో గా ‘అఖిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న “హలో” మూవీ టీజర్ ను ఆ చిత్ర బృందం విడదల చేసింది. ‘ ది లక్కిఎస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్... వాళ్ళు మాత్రం ఎవ్వరేం చేసినా.. ఏం అడ్డు వచ్చినా.. తన సోలోమెట్ కలుస్తారు... లైఫ్ ను షేర్ చేసుకుంటారు...” అంటూ నాగార్జున వాయిస్ తో మొదలయ్యే ఈ టీజర్ లో, అఖిల్ జంపింగ్స్, హీరోయిన్ గుళ్ళో హారతి తీసుకుంటున్న సన్నివేశాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ఈ సినిమాల‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మనం ఫేం విక్రమ్‌ కె.కుమార్ దర్శకత్వం వ‌హించగా, అనూప్‌ రుబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఈ సినిమాను వ‌చ్చేనెల‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.