దీపిక ప‌దుకునే ను చంపితే రూ.5 కోట్లు…

SMTV Desk 2017-11-16 19:37:19  deepika padukone, padmavati movie, sanjay bansali.

ముంబాయి, నవంబర్ 16: హాలీవుడ్ లో సైతం నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరొయిన్ దీపిక పదుకునే ను చంపితే రూ.5 కోట్లు ఇస్తామంటున్నారు. ఎవరు ఎందుకు అనుకుంటున్నారా..! దీపిక పదుకునే నటించిన ‘పద్మావతి’ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ చిత్ర విడుదలకు సిద్ధమైనప్పటినుండి విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దీపికను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని క‌ర్ణిసేన‌ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని సంఘాలు ఆ హీరోయిన్ ముక్కుకోయాల‌ని, ఆ సినిమా ప్రదర్శిస్తే సినిమా థియేట‌ర్ల‌ను ద‌గ్ధం చేస్తామని హెచ్చరించారు.