ట్రంప్ కు వేలు చూపించిన మహిళకు విరాళాలు..

SMTV Desk 2017-11-16 17:49:35  US President Donald Trump, Julie Briscoe supports three thousand people, Crowd funding.

వాషింగ్టన్, నవంబర్ 16 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు మధ్య వేలు చూపించి తన ఉద్యోగం పోగొట్టుకున్న జూలీ బ్రిస్క్‌ మాన్‌ కు మూడు వేల మంది మద్దతుగా నిలిచారు. ఆమె తన ఉద్యోగం పోగొట్టుకున్న దగ్గర నుండి వేరే ఉద్యోగ వేటలో పడిపోయింది. ఇదిలా ఉండగా ఆమె ఆర్ధిక అవసరాల నిర్వహణకు అవసరమయ్యే ఖర్చు కోసం అకిమా అనే ప్రభుత్వ కాంట్రాక్టర్‌ సోషల్ మీడియా మాధ్యమంగా క్రౌడ్ ఫండింగ్ సేకరణ ప్రారంభించారు. దీనికి నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది. 7 రోజుల్లోనే 3,000 మంది నెటిజన్లు 70,000 డాలర్లు పంపించారు. అయితే లక్ష డాలర్లు సేకరించి జూలీ బ్రిస్క్‌ మాన్‌ కు అందజేస్తానని అకిమా తెలిపారు.