అమితాబ్ కు తృటిలో తప్పిన ప్రమాదం...

SMTV Desk 2017-11-16 17:00:47  Amitabh Bachchan, bollywood big b, kolkata

ముంబాయి, నవంబర్ 16: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల 23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమితాబ్ పాల్గొన్నారు. ఫెస్టివల్‌ నుండి తన మెర్సిడీజ్ కారులో అమితాబ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ సీనియర్ మంత్రి తిరిగి వెళ్తుండగా వెనుక చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. డ్రైవర్ కారును అదుపు చేయడంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం అమితాబ్ మరో కారులో విమానాశ్రయానికి వెళ్లారు. ఈ ప్రమాద౦ జరిగిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.