అగ్రరాజ్యంలో 6వేల విద్వేష దాడులు..!

SMTV Desk 2017-11-16 14:39:50  america, crime rate, fedaral bureau of investigation.

వాషింగ్టన్, నవంబర్ 16: అగ్రరాజ్యమైన అమెరికాలలో రోజు రోజుకు విద్వేష దాడులు పెరుగుతూనే ఉన్నాయి. 2015 సంవత్సరంతో పోల్చుకుంటే 2016 సంవత్సరంలో 5 శాతం అధికంగా విద్వేష దాడులు అంటే 6 వేల కేసులు నమోదయ్యాయని అమెరికా పెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించారు. వీటిలో ఎక్కువగా నల్ల జాతీయులు లేదా ఆప్రోఅమెరికన్ లపై విద్వేష దాడులు జరిగాయి. హిందువులపై 12 దాడులు, సిక్కులపై 7 దాడులు, బుద్దిస్టులపై ఒక దాడి కేసు నమోదు కాగా, ముస్లింలకు వ్యతిరేకంగా ఇరవై ఐదు శాతం ఉన్నట్లు తెలిసింది.