టీడీపీలో జీవిత, రాజశేఖర్..!

SMTV Desk 2017-11-16 11:29:15  Rajashekhar, Jeevitha in TDP party, ap cm chandrababu naidu,

అమరావతి, నవంబర్ 16 : "గరుడ వేగ" చిత్రం ఘన విజయం సాధించడంతో మంచి ఊపు మీదున్న జీవిత, రాజశేఖర్ లు తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే పలు పార్టీలలో పని చేసిన వీరిద్దరికి రాజకీయ౦ పట్ల కాస్త అవగాహన ఉంది. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జీవిత మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపి౦చారు. మీరు టీడీపీలో చేరతారా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చేరమంటే చేరతామంటూ సరదాగా మాట్లాడారు. కాగా వీరిద్దరిని పార్టీలోకి ఆహ్వానించడానికి టీడీపీ సైతం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. 2009లో కాంగ్రెస్ లో చేరిన జీవిత రాజశేఖర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కింది. ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా వీరు పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీలో చేరేందుకు వీరు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.