కాలుష్యం పై కోహ్లీ ట్విట్...

SMTV Desk 2017-11-16 11:28:16  kohli, pollution twit, twitter, new delhi, kolkatha

న్యూఢిల్లీ, నవంబర్ 16 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ లో పెరిగిపోతున్న కాలుష్యం నివారించేలా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ లో 45 సెకన్ల నిడివి గల ఓ వీడియో ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. "హాయ్, ప్రస్తుత కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరేది ఒకటే. కాలుష్యం కోరలు ఇక లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సాయమందించండి. కాలుష్యంపై పోరాడి మ్యాచ్‌ గెలిచేందుకు అందరం కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా ఢిల్లీ వాసులు బయటికి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మీ ప్రయాణాన్ని బస్సు, మెట్రో రైలు, ఓలా క్యాబ్స్‌ ద్వారా ఇతరులతో షేర్‌ చేసుకోండి. వారంలో ఇలా ఒక్కసారి చేసినా ఎంతో మార్పు కనిపిస్తుంది. చిన్న పనుల ద్వారా ఎన్నో మార్పులు చేయవచ్చు" ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా పోస్ట్ ను, లైక్, షేర్ చేసి మీ మద్దతు ఇవ్వండి అని కోహ్లీ కోరారు.