లైంగిక వేధింపులు అరికట్టాలి : కమీషనర్‌ స్వాతిలక్రా

SMTV Desk 2017-11-15 16:13:49  Additional Police Commissioner (Crime) Swatilkra, children day special meeting in charminar.

హైదరాబాద్, నవంబర్ 15 : బాలలపై లైంగిక చర్యలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చట్టాలున్నాయని నగర అదనపు పోలీసు కమీషనర్‌ (క్రైమ్‌) స్వాతిలక్రా పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చార్మినార్‌ వద్ద హైదరాబాద్‌ పోలీసు షీ టీమ్స్‌ సంయుక్తాధ్వర్యంలో బాలలపై లైంగిక వేధింపుల నివారణ అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు చార్మినార్‌ నుంచి అలిజాకోట్ల మీదుగా బీబీబజార్‌ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. చిన్నారులకు లైంగిక వేధింపులు ఎదురుకాకుండా వారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితుల వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయలని సూచించారు.