కారు గూటీకి నల్లా భారతి

SMTV Desk 2017-06-11 15:45:10   State Vice President Nalla Bharti,CITU,Angan Waddy nalla bharathi

హైదరాబాద్, జూన్ 11 : సీఐటీయూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలైన నల్లా భారతి టీఆర్ఎస్ లో చేరారు. శనివారం మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం (టీఆర్ఎస్ కే వీ)లో సభ్యత్వం తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు సీఐటీయూ నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ అంగన్ వాడీ వర్కర్స్ (టీచర్స్), హెల్పర్స్ యూనియాన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా భారతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంగన్ వాడీల సమస్యలు పరిష్కారానికే తాను టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్ వాడీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని, దాంతో కార్యకర్తలకు పోరాటాలు చేసే అవసరం లేకుండా పోయిందని వెల్లడించారు. అంగన్ వాడీల ఒత్తిడి మేరకే ఈ టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కార్మికుల పక్షానా తాను చేస్తున్నపోరాటాన్ని ఒక మీదట కూడా కొనసాగిస్తానని, శాంతియుత పద్ధతుల్లో సామరస్యపూర్వకంగా ఉంటుందని స్వష్టం చేశారు. గత ప్రభుత్వాలలో తీవ్రమైన పోరాటాలు చేయాల్సి వచ్చేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్టితి లేదని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో అంగన్ వాడీలపై సస్పెన్షన్ వేటు పడుతుందని చెప్పారు. ఐసీడీఎస్ ను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తానని చెప్పారు. కాగా, క్రమశిక్షణ ఉల్లఘించినందున యూనియన్‌ నుంచి నల్లా భారతిని బహిష్కరిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడిల ప్రయోజనాలు ఆమె సర్కారుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాగా, భారతిని సీఐటీయూ నుంచి బహిష్కరిస్తున్నట్టు అంగన్‌వాడీ వర్కర్స్‌(టీచర్స్‌), హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మరో ప్రకటనలో తెలిపారు.