రాహుల్ @ "పప్పు" నిషేధం : ఈసీ

SMTV Desk 2017-11-15 11:33:12  Congress vice president, Rahul Gandhi, pappu name is prohibited.

న్యూఢిల్లీ, నవంబర్ 15 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని "పప్పు" అని సంబోధించడాన్ని గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పప్పు అని పిలుస్తున్నారని ఆరోపణలున్నాయి. అలాగే కొన్ని ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన ఓ ప్రకటనలో సైతం రాహుల్ ను "పప్పు" అని అభివర్ణించింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలుగా బీజేపీ నేతల ప్రసంగాల స్క్రిప్టును కూడా పంపింది. దీనిపై స్పందించిన ఈసీ.. ఓ నేతను అలా పిలవడం అవమానించడమేనని స్పష్టం చేస్తూ, పప్పు అనే పదాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది.