ఫిట్ నెస్ కోసం నేనే విశ్రాంతి అడిగాను : పాండ్యా

SMTV Desk 2017-11-14 10:34:20  haridik pandya, rest for fitness, india- srilanka series, indian cricket player

న్యూఢిల్లీ, నవంబర్ 14 : శ్రీలంక తో జరిగే రెండు టెస్టులకు పాండ్యా ను సెలెక్టర్లు విశ్రాంతినివ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "నేనే సెలక్టర్లను విశ్రాంతి అడిగా. నా శరీరం పూర్తి సిద్ధంగా లేదు. తీరికలేకుండా క్రికెట్‌ ఆడడంతో చిన్న చిన్న గాయాలతో ఇబ్బందిపడుతున్నా. పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, నూరు శాతం శ్రమించగలనని భావించినప్పుడే క్రికెట్‌ ఆడతా" అని పాండ్య అన్నాడు. భారత్ శ్రీలంక సిరీస్ తర్వాత, దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ-20లు ఆడనుంది.