నా మాట నిలబెట్టుకున్నా.. ఇప్పుడు నువ్వు : సుష్మాజీ

SMTV Desk 2017-11-13 18:06:38  Union Minister Sushma Swaraj, boxer Jhalak Tomar tweet, passport issue.

న్యూఢిల్లీ, నవంబర్ 13 : కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడడ౦ మాత్రమే తెలుసు. తిరిగి వారి ఎప్పుడు ఏమి ఆశించలేదు. అలాంటిది మొదటిసారి ఓ జూనియర్‌ బాక్సర్‌కి పాస్‌పోర్ట్‌ విషయంలో సాయం చేసి దానికి బదులుగా ఓ రిక్వెస్ట్‌ చేశారు సుష్మ. ఉక్రెయిన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఢిల్లీకి చెందిన ఝలక్‌ తోమర్‌ అనే జూనియర్‌ బాక్సర్‌ పాల్గొనాల్సి ఉండగా.. ఆమెకు పాస్‌పోర్ట్‌ విషయంలో ఏవో సమస్యలు వచ్చాయి. దీంతో సమస్యను సుష్మాజీకి వివరించగా వెంటనే స్పందించిన సుష్మా.. అడిగిన వెంటనే ఆమె పాస్‌పోర్ట్‌ సమస్యలు తీర్చారు. తనకు సాయం చేసినందుకు తోమర్ తో ఓ రిక్వెస్ట్‌ చేశారు. తనకు సాయం చేసినందుకు భారత్‌కు పతకం సాధించాలని కోరారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. “ఝలక్‌ తోమర్‌.. నేను నామాట నిలబెట్టుకున్నాను. నీకు కావాల్సిన పాస్‌పోర్ట్‌ నీకు అందుతుంది. ఇందుకు బదులుగా నువ్వు భారత్‌కు పతకం తీసుకురావాల్సిందే” అని సరదాగా ట్వీట్‌ చేశారు.