నాలుగేళ్ల పాలనలో టీడీపీ చేసిందేమీ లేదు!

SMTV Desk 2017-11-13 17:38:51  Congress Vice President Jagan, long march, podduturu, duvvuru

ప్రొద్దుటూరు, నవంబరు 13: ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తవుతున్న టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, విపక్ష నేత కాంగ్రెస్ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించి రాత్రి 8 గంటలకు దువ్వూరు మండలకేంద్రం రామమందిరం వరకు మొత్తం 16 కిలోమీటర్ల మేర కొనసాగించారు. అనంతరం దువ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే జగన్ ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. తాను పాదయాత్ర చేస్తుంటే వేల మంది తనతో నడుస్తూ ఆప్యాయతను పంచిపెడుతున్నారని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పాదయాత్రలో, పొలాల్లో నాట్లు పడుతున్న విషయాన్ని గమనించాను. దివంగత నేత వైఎస్‌ ఆగస్టు 20 నుంచి కేసీ కెనాల్‌కు నీరు వదిలే వారు. వైఎస్‌ పాలనలో కేసీ కెనాల్‌ ఆయకట్టులో 2 పంటలు పండిన రోజులున్నాయన్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారంటే... ఎక్కడ పేదవాడి నుంచి భూములను లాక్కోవాలనే విషయంపైనే ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని విపక్ష పార్టీ పై ఆయన మండిపడ్డారు. కేసీ కెనాల్‌ను స్థిరీకరించేందుకు రాజోలి ఆనకట్టను కట్టాలని జగన్‌ సూచించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులు కేసీ నీటిపైనే ఆధారపడ్డారని, 2008లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు రూ.630 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్‌ చేశారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతుల పంటల విషయంలో, ఇంకా ప్రాజెక్టు గురించి పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్నారు. గండికోట, సర్వారాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టులు కూడా పూర్తికాలేదని ఆయన విపక్షా నేతపై ఎద్దేవా చేశారు.