ఎన్నికలకు తొలి జాబితా సిద్దం..

SMTV Desk 2017-11-13 16:31:30  Gujarat assembly elections, congress party, first list ready.

న్యూఢిల్లీ, నవంబర్ 13 : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాల అభ్యర్థుల కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి 70మంది పేర్లున్న జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 182 స్థానాలకు గానూ తొలి విడత సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా నవంబరు 16న అభ్యర్థుల పేర్లను వెల్లడించి, మిగిలిన 19 స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను సాధ్యమైనంత త్వరగా వెల్లడించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని కోసం ఈ నెల 21వరకే సమయం ఉన్నందున అతి త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.